Post content
జీవితంలో చివరి మజిలీలు మొదటి మజిలీ: 60 నుంచి 70 సంవత్సరాల మధ్య మీరు మీరు పనిచేస్తున్న వ్యవస్థ/సంస్థ నుంచి దూరంగా జరుగుతారు మీరు ఎన్ని విజయాలు సాధించినా, ఎంత శక్తివంతులైనా ఒక మామూలు మనిషి” గా మాత్రమే మిగిలి పోతారు. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో గతంలో పోషించిన హోదాలు, చెలాయించిన పెత్తనం మీ బుర్ర లోంచి తొలగించుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాటిని ఎవరు పట్టించుకోరు. రెండవ మజిలీ: 71 ఏళ్ల నుంచి 80 వరకు ఈ వయసులో సమాజం మిమ్ములను నెమ్మదిగా దూరం చేస్తూ ఉంటుంది. మీ మిత్రులు, సహోద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. మీరు గతంలో పనిచేసిన చోట కూడా మిమ్ములను గుర్తించేవారి సంఖ్య కూడా పలచబడుతుంది. నేను అప్పట్లో అలా ఉండేవాడిని”, ఒకసారి ఎం చేశానో తెలుసా” అని ఎవరితో చెప్పకండి. మీ తరువాతి తరం ఆ విషయాలు పట్టించుకోరు. మీరు బాధ పడకూడదు. దీనినే డమాబుస్ స్తితి అంటారు. మూడవ మజిలీ: 81- 90 సంవత్సరాల మధ్య ఈ మజిలీలో మీకు ఎందరు సంతానం ఉన్నా, మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నా మీరు మీ జీవిత భాగస్వామితోనో, లేక ఒంటరీగానో మాత్రమే మిగిలిపోతారు. కుటుంబం మీనుంచి దూరం జరుగుతూ ఉంటుంది. మీ పిల్లలు ఎప్పుడైనా ఒకసారి వచ్చి మిమ్ములను పలకరిస్తే, అది మీ మీద ప్రేమ, అభిమానం, గౌరవంగా భావించండి. ఎప్పుడో వచ్చి మొహం చూపించి వెళతారని కోపగించుకోకండి. వారు ఊపిరి సలపని పనుల్లో ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నాల్గవ/చివరి మజిలీ: 91 ఏళ్ల తరువాత ప్రకృతి మీ శరీరాన్ని క్షీణింప చేస్తుంది. అందుకోసం విచారించాల్సిన అవసరం లేదు. జీవిత చరమాంకంలోకి ప్రవేశించామని గుర్తించండి. శరీరం సహకరించినంత వరకు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి. మీకు నచ్చింది తినండి, త్రాగండి, ఆడండి, పాడండి. ఆనందంగా , హుషారుగా ఉండండి. అంతే!!! అంత శివోహం.. సర్వేజనా సుఖినోభవంతు ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏