TGTGInsighttelegram intelligenceLIVE / telegram public index
← Inspiring Thoughts
Inspiring Thoughts avatar

TGINSIGHT POST

Post #11006

@Inspiringthoughts

Inspiring Thoughts

Views1,950Post view count
PostedOct 1810/18/2025, 03:45 AM
Post content

Post content

💥 ఒక యదార్ధ గాధ.... అతి శీతల గిడ్డంగిలో పని చేస్తున్న ఓ వ్యక్తి కథ! ఆ రోజు పొద్దుపోయి... చీకట్లు ముసురువేళ..ఎవరికి వాళ్లు పని ముగించికొని ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు! అతను మాత్రం సమయం చూడకుండా ఆ శీతల యంత్రంలో వచ్చిన సాంకేతిక సమస్యను సరిజేస్తూ లోపలే ఉండిపోయాడు! దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసేసారు! గాలి చొరబడిని శీతలగిడ్డంగిలో తాను అనుకోకుండా బంధీనైనానని గ్రహించాడు! గంటలు గడుస్తున్నాయి! బయటపడే మార్గం లేక తానిక ఐస్ గడ్డల్లో సజీప సమాది కాబోతున్నాననుకుంటున్న సమయంలో.... ఎవరో డోర్ ఓపెన్ చేసిన అలికిడి... ఆశ్చర్యం... టార్చ్ లైట్ తో సెక్యూరిటీ గార్డ్ వచ్చి తనను రక్షించాడు! బయటకు వచ్చేటపుడు ఈ అధ్భుత ఘటన నుండి తేరుకుంటూనే "నేను లోపలే ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీకు సమాచారం ఎవరిచ్ఛారు?" అడిగాడు గార్డ్ ని! "ఎవ్వరూ చెప్పలేదు సార్! ఈ సంస్థలో 50 మందికి పైనే పని చేస్తున్నారు... కానీ ప్రతిరోజూ విధి నిర్వహణకు వస్తూ ఉదయం 'హలో' అని.. సాయింత్రం ఇంటికి వెళ్తూ 'బై' అని చెప్పి పలకరించేది మీరొక్కరే సర్! ఈరోజు ఉదయం 'హలో' అని పలకరించిన మీరు.. సాయింత్రం 'బై' చెప్పలేదు.. దాంతో నాకు అనుమానం వచ్చి తనిఖీకి వచ్చాను అంతే సార్!" అన్నాడు. అతనూహించలేదు.. అతనికి ముందుగా తెలియదు!' భేషిజం గాని బాస్ 'ఇజం గాని లేకుండా ప్రతిరోజూ ఇలా తాను చేసే ఒక చిన్న పలకరింపుపూర్వక "సంజ్ఞ" కారణంగా తన ప్రాణాలు కాపాడబడ్తాయి అని! మనకు తెలియకపోవచ్చు అటువంటి అధ్భుతాలు మన జీవితంలోనూ తారసపడవచ్చని! నిజ జీవితంలో పరస్పరం ఉపయోగించే భావజాలం, ప్రవర్తన, చర్యలను బట్టే ఎదుటి వారి వైఖరి ఉంటుంది! అందుకు ఎవరికీ ఏ విద్యార్హతలు ప్రమాణికం కాదు! ఏదో సినిమాలో అన్నట్లు "వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ...." అవసరంలేదు.. ఆత్మీయమైన పలకరింపుగా ఒక్క చిరునవ్వు చాలు... కొంతమంది వారికి అవసరమైతే, అవసరమైనపుడు మాత్రమే పలకరించడం .. అవసరం లేకపోతే నువ్వు ఎవరో తెలియనట్లుగా.... ప్రవర్తించడం. మరికొంతమంది పుడుతూనే వెండి గరిట... బంగారు గరిట.. నోట్లో పెట్టుకొని పుట్టినట్లుగా మితిమీరిన గర్వంతో ప్రవర్తిస్తారు... కొంతమంది అధికారులు తన క్రింది ఉద్యోగులను చులకనగా, హీనంగా చూస్తారు... ఇలాంటి వారికి తెలియదు జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని... ఆరోజు ఆ భగవంతుడు కూడా వారికి అండగా ఉండదు అని... అది వారి ఖర్మ... ప్రతి మనిషినీ స్నేహపూర్వకంగా గౌరవంగా చూడాలి.. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి... సంపద, అధికారం అనేవి నీటి బుడగలే... శాశ్వతం కాదు...