TGTGInsighttelegram intelligenceLIVE / telegram public index
Post content
Post content
వయసు వల్ల వచ్చిన అధికారంతో నీ చుట్టూ ఉన్నవాళ్ళని శాసించకు. వీలైనంత వరకూ వారి చర్యలపై నీ అమూల్యాభిప్రాయాన్ని వెల్లడి చేయకు. నీ బోధనలు ఆపి ఒక్కడివే ఉండటం ఎలాగో నేర్చుకో. లేకపోతే నీ ఇంటివారు నిన్ను మరింత దూరం పెడతారు. ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువు. ఏకాంతంలో సంగీతాన్ని విను. ఓపికుంటే మొక్కల్ని పరిరక్షించు. చిన్న పిల్లలతో కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పు. అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు. “ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఇలా ప్రిపేర్ అయ్యావో నీ వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలు వాయిదా వెయ్యగలవు” అంటాడు 'The sky gets dark slowly' అన్న పుస్తకంలో రచయిత వ్రాసింది. ఈ పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయింది💐😊🙏